సినీ సంభందిత కోర్సులతో ఐఐఎం
అహ్మదాబాద్ : వినోద రంగంలో ప్రదాన వ్యాపార సాధనంగా మారిన సినీ నిర్మాణం పట్ల ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నా, వారికి కార్పొరేట్ స్థాయి శిక్షణ లభించడం లేదని ఐఐఎం వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆ లోటును తీర్చి, సినీ నిర్మాణ శైలిపై పరిశోధన జరిపే స్థాయి లక్ష్యంతో సినీ నిర్మాణ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు ఐఐఎం వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి అహ్మదాబాద్ ఐఐఎంలో సినీ నిర్మాణంపై మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశపెట్టాలని అధికారులు నిశ్చయించారు. సినీ నిర్మాణం, సినీ చరిత్ర, భారతీయ క్లాసిక్స్ ఇత్యాది అంశాలను ఈ కోర్సులో భాగంగా బోధిస్తామని ఐఐఎం వర్గాలు ప్రకటించాయి. కోర్సుల్లో భాగంగా పలువురు ప్రసిద్ద సినీ ప్రముఖులతో క్లాసులు కూడా ఉంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications
