సూర్యప్రభ వాహనంపై వెంకటేశుడు

Surya Prabha Vahanam
తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో భక్తులకు కనువిందు చేశారు. భక్తజనుల గోవిందనామస్మరణతో... పరివారమంతా వెంటరాగా మాడవీధుల్లో వూరేగే స్వామిని భక్తులు అధికసంఖ్యలో వీక్షించి తరించారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుమంజనం, అనంతరం సాయంత్రం 7 గంటలకు వూంజల్‌సేవ, రాత్రికి చంద్రప్రభ వాహనసేవ జరుగుతుంది.

ఇక నిన్న తిరుమల బ్రహోత్సవాల్లో సాయంత్రం స్వర్ణరథోత్సవం జరిగింది. ఆ తర్వాత రాత్రి గజవాహనసేవ నిర్వహించారు. రాత్రి గజవాహనసేవ భక్తజనులను పరవశింపజేసింది. స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుని వైభవాన్ని కళ్లారా తిలకించేందుకు భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+