చిరుపార్టీపై యువత ఆసక్తి: పవన్
హైదరాబాద్: నటుడిగా కంటే రాజకీయ పార్టీ కార్యకర్తగా ఎక్కువ ఆనందం పొందుతున్నానని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని కొండాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించి పలుచోట్ల ప్రసంగించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక యువతరం రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రచారం చేయనున్నారు. చిరంజీవి ఈనెల 10 నుంచి ఉత్తరాంధ్రలో ప్రజాయాత్రలు ప్రారంబించనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
