చంద్రబాబుతో బాలకృష్ణ విశేష భేటీ

ఆదివారం నాటి సమావేశం వివరాలను చంద్రబాబుకు వివరించిన బాలయ్య, సంఘాల నేతలు బాబును కలవాలనుకుంటున్న విషయాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అర్హులకు టికెట్లు ఇవ్వాలని కోరారు. పార్టీకి, నందమూరి కుటుంబానికి విధేయులుగా ఉన్న సమర్ధులకు టికెట్లు ఇవ్వడానికి అభ్యంతరమేమీ లేదని ఈ సందర్భంగా బాబు పేర్కొన్నట్టు సమాచారం. 'గర్జన'ను ముందే అనుకున్నట్లు ఈ నెల 24నే జరపడం మంచిదని బాలయ్య స్పష్టంచేశారు. బాబు కూడా ఆయనతో ఏకీభించారు.
యువగర్జన నిర్వహణపై గుంటూరు జిల్లా నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏర్పాట్లకు సమయం చాలదని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఈనెల 24నే నిర్వహించాలని నియోజకవర్గాల నేతలు, యువత కమిటీల నాయకులు కోరుతున్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన గుంటూరు జిల్లా సమావేశంలో కూడా ఎక్కువ మంది ఇదే సూచన చేశారు.
అయితే, బుధవారం జరిగే ముఖాముఖిలో తుది నిర్ణయం తీసుకుందామని బాబు చెప్పారు. గర్జన ఏర్పాట్లు, తెలుగు యువత ఉద్యమాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, మరికొందరు నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసంలో ఆయనను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications