రైతులకు ఉచిత విద్యుత్ ..చిరు వాగ్ధానం

Chiranjeevi
శ్రీకాకుళం: ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి ప్రజా అంకితయాత్ర పేరుతో జరుపుతున్న రోడ్ షో లో శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట మండలం వద్ద మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని ప్రకటించారు. అలాగే రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేస్తానని, వ్యవసాయానికి ఆటంకం ఏర్పడకుండా 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేస్తానని, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని, నేత కార్మికులు, మత్స్యకారులను ఆదుకుంటానని చిరంజీవి తెలిపారు. రాజకీయాలు మారాలని, మధ్యతరగతి వర్గాలు సంతోషించేలా మార్పులు తెస్తానని, మహిళలకు సంక్షేమపథకాలు కల్పిస్తానని అన్నారు.

అంతేగాక మిమ్మల్ని మీరు పాలించుకొనే రోజులు వస్తాయని, అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని, అందుకే మీ పిలుపు మేరకు మీ ముందుకు వచ్చానని, ఉన్న వనరులను సరిగ్గా వినియోగించుకోలేక, రైతన్నలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని పేర్కొన్నారు. నాకు రాజకీయాలు రావాలంటే యూనివర్శిటీలో చదవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వచ్చిన విమర్శలను తిప్పికొట్టలేక కాదని, సంయంమనం పాటిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+