ఫ్రెంచి రచయితకు నోబెల్ సాహిత్య బహుమతి
స్టాక్ హోం(స్వీడన్): ఈసారి నోబెల్ సాహిత్య బహుమతి ఒక ఫ్రెంచి రచయితను వరించింది. ఫ్రెంచి నవలా రచయిత జీన్- మేరీ గుస్తావ్ లె క్లెజియోకు (68) 2008 సంవత్సరపు నోబెల్ బహుమతి లభించింది. లె క్లెజియో రచనల్లోని కవితాత్మకతను, మానవతను స్వీడిష్ అకాడమీ ప్రస్తుతించింది. లె క్లెజియో 1980లో "డిజర్ట్" అనే నవల ద్వారా సాహితీ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఉత్తర ఆఫ్రికా అడవిలో సంస్కృతి కోల్పోయిన వారి గురించి ఆయన ఆ నవల రాశారు. లె క్లెజియో కు ఈ రచనకు గాను ఫ్రెంచి అకాడమీ అవార్డు లభించింది. ఈ రచయిత "టెర్రా అమట", "ద బుక్ ఆఫ్ ఫ్లైట్స్" "వార్ ", "ద జెయింట్స్" నవలలు రాశారు. ఈ రచయిత 1940 లో నైస్ లో జన్మించారు. ఎనిమిదేళ్ళ వయసులో ఆ కుటుంబం నైజీరియాకు వెళ్ళి స్ధిరపడింది. ఆయన తండ్రి రెండో ప్రంపంచ యుద్ధకాలంలో అక్కడ వైద్యుడిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications