సిట్టింగ్ జడ్జి విచారణకు బాబు డిమాండ్

రాష్ట్రంలో పూర్తిగా ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, రౌడీమూకలు స్వైరవిహారం చేస్తున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంతకు ముందు నిజామాబాద్ లో విమర్శించారు. ఒకే ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబసభ్యులను సజీవదహనం చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని ఆయన అన్నారు. బైంసాలోని వటోలి గ్రామంలో బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ఆయన దారిలో నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఓ వైపు రాష్ట్రం అల్లరిమూకల ఆగడాలతో అట్టుడుకుతుంటే ముఖ్యమంత్రి జాతీయభద్రతా సమావేశాల్లో తమ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా చిత్రీకరించుకుని పొగడ్తలు పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications