కూలిన పాత డెంటల్ కాలేజీ భవనం
విజయవాడ: విజయవాడలో పాత డెంటల్ కాలేజి భవనం కూలి పలువురు కూలీలు శిథిలాలకింద చిక్కుకున్నారు. ఇందులో గతంలో డెంటల్ కాలేజీ ఉండేది. కొత్త భవనం నిర్మించి కాలేజీని అక్కడికి తరలించారు. దీన్ని కూలగొట్టే పనులు జరుగుతున్నాయి. సోమవారం ఆ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా భవనం మూడంతస్తులు కూలిపోయాయి. వాటికింద కొందరు కూలీలు చిక్కుకుని పోయారు. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి. తోటికూలీలు, అధికారులు రంగంలోకి దిగి తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. శిథిలాలకింద మరో 10 మంది ఉన్నట్లు భావిస్తున్నారు.
మూడు నెలల క్రితం డెంటల్ కాలేజీ కొత్త భవనంలోకి మారింది. ఆ తర్వాత పాత భవనం మరమ్మత్తు పనులు ప్రారంభించారు. కొంత భాగాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పనిలో సోమవారం నాడు దాదాపు పాతిక మంది కూలీలు నిమగ్నమయ్యారు. ఈ సమయంలో హఠాత్తుగా భవనం రెండో అంతస్థు కూలింది. కొంత మంది కూలీలు బయటకు రాలేక శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications