దాస్ మున్షీ ఆరోగ్యం ఆందోళనకరం

62 ఏళ్ల దాస్ మున్షీని సోమవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో ఎయిమ్స్ చేర్చారు. శ్వాస సంబంధమైన సమస్యతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఆయనను ఐసియులో వెంటిలేటర్ పై ఉంచారు. గత మూడు నెలల్లో ఆయనకు గుండె పోటు రావడం ఇది రెండో సారి. కోల్ కత్తాలో ఆయనకు జులైలో ఆంజియోప్లాస్టీ జరిగింది. కీలకమైన శరీరాంగాలు నిలకడగా పనిచేస్తున్నాయని, అయితే పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications