వటోలిని సందర్శించిన పిఆర్పీ నేతలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా సమీపంలోని వటోలీలో సజీవ దహనమైన ఆరుగురి కుటుంబాలను ప్రజారాజ్యం పార్టీ నేతలు అల్లు అరవింద్, పరకాల ప్రభాకర్‌లు సోమవారం పరామర్శించారు. విధ్వంసం జరిగిన ప్రదేశాలను కూడా పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని వారు ఈ సందర్భంగా అన్నారు. విధ్వంసానికి స్వస్తి పలికి, సంయమనం పాటించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బైంసా పట్టణానికి సమీపంలోని వటోలీ గ్రామంలో ఆదివారం ఒకే వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాటోలీ గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక ఇళ్లు ఆదివారం 02.00 గంటల సమయంలో మంటల్లో చిక్కుకుంది.బైంసాలో దుర్గమాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. అప్పటినుంచి బైంసా పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. దాని కొనసాగింపుగానే వటోలీ గ్రామ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications