కాంగ్రెస్ భరతం పట్టండి: చంద్రబాబు

Chandrababu Naidu
మెదక్: అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లాలోని గజ్వెల్ లో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మంగళవారంనాడు పాల్గొన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం గుడ్డిది, చెవిటిదని ఆయన వ్యాఖ్యానించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసుది దోపిడీ, అవినీతి ప్రభుత్వం కావడం వల్లనే ప్రజల కష్టాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ధరలను నియంత్రించామని ఆయన చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు లేకుండా పెద్దలకు ప్రభుత్వం భూములు కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అవినీతిపై తాము గత నాలున్నర ఏళ్లుగా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములు అమ్మడానికి వీలు లేదని తాము మహా ధర్నా చేశామని ఆయన చెప్పారు. చేతకాని ప్రభుత్వం వల్లనే సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+