పెద్దల కోసం కోస్తా కారిడార్: చిరు

Chiranjeevi
విశాఖపట్నం: కొంత మంది బడా బాబుల కోసం కోస్తా కారిడార్ ను అనుమతిస్తున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. పేదల పొట్టలు కొట్టి, వారి జీవితాలను బజారుకీడ్చి కొంత మంది పెద్దల కోసమే కోస్తా కారిడార్ కు పూనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర మంగళవారం విశాఖపట్నం జిల్లాలో సాగుతోంది. ప్రభుత్వాలు ప్రజాసమస్యలు తీర్చలేనప్పుడు రాజకీయ శూన్యత ఉన్నట్లు కాదా అని ఆయన అడిగారు. కోస్తా కారిడార్ వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని ఆయన అన్నారు. పేదలకు కనీసావసరాలను తీర్చే పరిస్థితిలో కూడా పాలకులు లేరని ఆయన విమర్శించారు.

తమ పార్టీ కార్యకర్తల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. కొంత మంది ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఓటు హక్కు కోసం శాంతియుతంగా పోరాడాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజారాజ్యం పార్టీ విధివిధానాలను ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా వెల్లడించారు. గ్రామస్వరాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజలకు నిధులు, విధులు ఇస్తామని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థపై కూడా తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని, విద్యలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+