ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు మంగళవారం ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రస్తావన మాత్రం కమీషన్ చేయలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మిజోరాం రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావం గల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మాత్రం రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రాలకు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి.
ఛత్తీస్ ఘడ్ లో నవంబర్ 14, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో నవంబర్ 25వ తేదీన జరుగుతుంది. మిజోరాం, ఢిల్లీల్లో ఎన్నికలు నవంబర్ 29వ తేదీన జరుగుతాయి. రాజస్థాన్ లో డిసెంబర్ 4వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన జరుగుతుంది. తమ ముగ్గురు సభ్యుల మధ్య గల భిన్నాభిప్రాయాల వల్ల ఎన్నికల కమీషన్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్. గోపాలస్వామి మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications