విశాఖపట్నం: ప్రజల స్పందన నుంచే ప్రజారాజ్యం పుట్టిందని ప్రత్యేకంగా తాము చేసిందేమీ లేదని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. విశాఖ జిల్లాలో ఈరోజు ఆయన ప్రజా అంకిత యాత్ర సాగుతోంది. తగరపు వలసలో ఆయన మాట్లాడుతూ పాలకులు ప్రజా సమస్యలు తీర్చటంలో విఫలం అయ్యారని అందుకే రాజకీయ శూన్యత ఏర్పడిందని అన్నారు. దీన్ని పూరించాలంటే సామాజిక న్యాయం జరగాలంటే ప్రజారాజ్యం రావాలన్నారు. తమ కార్యకర్తల పేర్లు ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. దీన్ని నిరసిస్తూ తాము శాంతియుతంగా పోరాడుతామన్నారు. తనను 30 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న ప్రజలకోసం వారి జీవితాలను మెరుగుపరచటం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు. తమకు ఎలాంటి ఎజెండా లేదని, ప్రజాభీష్టమే ఎజెండాగా తెల్లకాగితంలా ప్రజల ముందుకు వచ్చానని ఆయన అన్నారు. ఇక్కడినుంచి ఆయన పెందుర్తి వెళతారు