హైదరాబాద్ భవిష్యత్తు తేల్చాలి: జెసి
హైదరాబాద్: రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే హైదరాబాద్ భవిష్యత్తును తేల్చాల్సిందేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రాష్ట్రాలు కావాలని కోరుతున్నట్లుగానే హైదరాబాద్ స్థానికులు తమ ప్రాంతానికి ప్రత్యేక స్థానం కోరుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రాంత నాయకుడు కె. చంద్రశేఖరరావు వంటివారు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని ఏ విధంగా అంగీకరించడం లేదో హైదరాబాద్ స్థానికులు ఇతర ప్రాంతాలకు చెందిన కెసిఆర్ వంటివారి నాయకత్వాన్ని అంగీకరించడం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ భవిష్యత్తు తేల్చకుండా రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ స్థానికులు తమకు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాము కర్ణాటకలో ఉండడానికే ఇష్టపడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications