టీవీ5 కరీంపై హత్యాయత్నం
హైదరాబాద్: టీవీ 5 అసోసియేట్ ఎడిటర్ కరీంపై గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం దాడి చేశారు. బెల్ శబ్దం విని తలుపు తీసిన కరీం మొహంపై యాసిడ్ చల్లిన దుండగులు ఆ తర్వాత కత్తులతో పొడిచినట్టు తెలుస్తోంది. 108 అంబులెన్స్ లో కరీంను అపోలో ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
కరీం మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కొంతకాలం ఒక ప్రముఖ టీవీ యాంకర్ తో సహజీవనం చేశాడు. దీనిపై ఆయన మొదటి భార్య పోరాటం చేశారు. కొంతకాలం టీవీ 9 లో పనిచేసిన కరీంపై అనేక ఆరోపణలు రావడంతో అతడిని ఆ యాజమాన్యం తొలగించింది. కరీం తాజాగా ఒక ప్రముఖ చానల్ లో పనిచేసే యాంకర్ ను పెళ్ళి చేసుకుని యూసుఫ్ గుడా లోని ఒక అపార్ట్ మెంట్ ఐదో ఫ్లోర్ లో ఉంటున్నాడు. ఈ వార్తను ఇప్పటి వరకు ఏ టీవీ చానల్ కూడా ప్రసారం చేయకపోవడం గమనించవలసిన విషయం.












Click it and Unblock the Notifications