ఎన్నారై హోదా : ఐశ్వర్య కష్టాలు

Aishwarya Rai
ముంబయి: బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ని ఆదాయం పన్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నారైగా చెప్పుకుంటూ ఆమె సమర్పించిన ఐటి అంచనాలు ఆమెను వెంటాడుతున్నాయి. తాను ఎన్నారైని అయినందును మిస్ వరల్డ్ గా తనకు వచ్చిన 50 వేల పౌండ్ల సొమ్ము ఆదాయం పన్ను పరిధిలోకి రాదని ఐశ్వర్యా రాయ్ క్లెయిమ్ చేయడాన్ని సెంట్రల్ - 1 ఆదాయం పన్ను కమీషనర్ బొంబాయి హైకోర్టులో సవాల్ చేశారు. కమీషనర్ అపీల్ ను ఐశ్వర్యా రాయ్ తరఫు న్యాయవాది పెర్సీ పర్దివాలా వ్యతిరేకించారు. అయితే జస్టిస్ రాధాకృష్ణ నేతృత్వంలోని బెంచ్ ఆ అపీల్ ను విచారణకు స్వీకరించారు.

తన కెరీర్ ప్రారంభంలో ఐశ్వర్యారాయ్ 1996-97లో తన ఆదాయాన్ని 2.14 లక్షల రూపాయలుగా చూపింది. అయితే ఐటి శాఖ 2000లలో సోదాలు నిర్వహించింది. అయితే తాను ఎన్నారైగా ఐటి రిటర్న్స్ లో ఐశ్వర్యా రాయ్ చూపడం సరి కాదని, ఆమె 92 రోజులు మాత్రమే భారత్ ఆవల ఉందని, నిజానికి 186 రోజులు ఉండాలని, అందువల్ల ఆమె ఎన్నారైగా క్లెయిమ్ చేయడం తప్పని ఐటి శాఖ ఈ సోదాల సందర్భంగా నిర్ధారణకు వచ్చింది. అందువల్ల మిస్ వరల్డ్ గా ఆమె పొందిన 50 వేల పౌండ్లు (26 లక్షల రూపాయలు) ఆదాయం పన్ను పరిధిలోకి వస్తాయని ఐటి అధికారులు 2004లో ఆదేశాలు జారీ చేసింది. అందులో పన్ను కింది వచ్చే సొమ్ము 14 లక్షల రూపాయలు కాగా, వడ్డీ దాదాపు 50 లక్షల రూపాయలు అవుతుంది.

ఈ ఆదేశాలను ఐశ్వర్యా రాయ్ సవాల్ చేసి, నవంబర్ పాక్షికంగా ఊరట పొందింది. ఐటి శాఖ అధికారాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఆదాయం పన్నుఅపిలేట్ ట్రిబ్యునల్ లో మరో అపీల్ ను దాఖలు చేసింది. 2007 అక్టోబర్ లో ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+