హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్ పేటలో గల గురుద్వారలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సోదరుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రార్థనలు చేశారు. సిక్కు గురువుల అహ్వానం మేరకు ఆయన ఇక్కిడికి వచ్చారు. ప్రజారాజ్యం పతాకను ఆయన ఆవిష్కరించారు. ఆయనను చూడడానికి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. దాంతో కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.