15 వేల మందికి ఎయిర్ ఇండియా 'టాటా'
హైదరాబాద్: పౌర విమానయాన రంగాన్ని మరింత ఎక్కువగా ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తోంది. తమ సిబ్బందిలోని 15 వేల మందికి మూడు నుంచి ఐదేళ్ళ పాటు జీతం లేని సెలవు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా సిఎండి రఘు మీనన్ నేడిక్కడ ఒక న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఈ ఆఫర్ ను అంగీకరించి దీర్ఘకాలిక సెలవులో వెళ్ళే వారికి నిర్ణీత కాలం తర్వాత తిరిగి అదే జీతంతో, అదే సీనియారిటీతో కంపెనీలో చేరే అవకాశముంటుందని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications