వంద స్కామ్ లు బయటపెడ్తాం: బాబు

ఎన్నికల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎవడబ్బ సొమ్ము ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిబిఐ ముఖ్యమంత్రి జేబు సంస్థలా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే భైంసా అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై నిరంతర పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 1వ తేదీ నుంచి వరుసగా రోజుకొకటి చొప్పున ప్రభుత్వానికి చెందిన వంద కుంభకోణాలను బయట పెడతామని ఆయన చెప్పారు. కోస్తా కారిడార్ పేరిట ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కుంటోందని, మత్స్యకారుల ఉపాధిని కొల్లగొడుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications