ఒవైసీ ఒక్కరే నాయకుడు కారు: డిఎస్

ఆంధ్రలో 1956లో తెలంగాణను ఫజల్ అలీ కమీషన్ సూచనలకు విరుద్ధంగా విలీనం చేశారని, అప్పటి నుంచి తెలంగాణ అంశం చర్చనీయాంశంగా ఉంటూనే వస్తున్నదని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ముస్లింలని కాదు గానీ తెలంగాణ ప్రజల మనోభావాలు ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంపై ప్రశ్నించగా కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం కాస్తా ఎక్కువని, అందుకే కాస్తా ఎక్కువగా మాట్లాడుతుంటారని, పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత అంతా కుదురుకుంటుందని ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ నాయకులు చవటలు, దద్దమ్మలు అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించడంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications