ప్రజారాజ్యం పార్టీకి ఇసి గుర్తింపు
న్యూఢిల్లీ: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల కమీషన్ గుర్తింపు లభించింది. తర్వలో ఎన్నికల గుర్తు ప్రకటించనుంది. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ నమోదుకు ఎన్నికల కమీషన్ వద్ద న్యాయపరమైన అన్ని పనులు పూర్తి చేశామని ఆ పార్టీ నాయకుడు వినయ్ అంతకు ముందు చెప్పారు. ప్రజారాజ్యాన్ని రాజకీయ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమీషన్ ప్రకటన వెలువడడమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. వినయ్ గురువారం నాడు ఢిల్లీలో ఎన్నికల కమీషన్ అధికారులను కలిశారు. ఉత్తరాంధ్రలో చిరంజీవికి అనూహ్యమైన ప్రజాస్పందన లభించిందని ఆయన అన్నారు.
కడపకు చెందిన న్యాయవాది చిన్నకృష్ణయ్య ఇదే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకోవడంతో చిరు పారీ ్టకి అడ్డంకులు తొలిగినట్లైంది.చిరంజీవి పార్టీని ప్రారంభించడానికి ఒకరో జు ముందే చిన్న కృష్ణయ్య తా నుఅదేపేరుతో దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. చివరికి దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్‌కు ఆయన తెలియజేశారు. ఆగస్టు 26న తిరుపతిలో లక్షలాదిమంది అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో చిరంజీవి సినీ స్టయిల్‌లో తన పార్టీని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications