బాలయ్య సిఎం అభ్యర్థి అయితే..: పురంధరేశ్వరి

తన సోదరుడు, సినీ నటుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పట్ల తన వైఖరి మారదని కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధరేశ్వరి మంగళవారంనాడు తిరుపతిలో అన్నారు. తమ తండ్రి ఎన్టీ రామారావు మరణించినప్పు ఏం జరిగిందే తనకు తెలుసునని, ఆ రోజును తాను మర్చిపోలేనని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు.
ముఖానికి రంగు వేసుకున్నంత మాత్రాన ఎన్నికల్లో ఓట్లు రాలవని ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారని, మరి ఇప్పుడు సినీ గ్లామర్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు లేవని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఇంతకు ముందు అన్నారని, మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications