హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, తెరాసను ఎదుర్కోవాలంటే తెలంగాణాపై పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్టీలో కొన్ని తెలంగాణా వ్యతిరేకశక్తులు ఉన్నాయని, తెలంగాణా నేతలంతా కలిసి అధిష్టానానికి వాస్తవాన్ని వివరించాల్సి ఉందని ఆయన అన్నారు.
తెదేపా తెలంగాణా నిర్ణయాన్ని అనుమానించవలసిన అవసరం లేదన్నారు. ముస్లింలు తెలంగాణా కోరుకోవటం లేదన్న ఒవైసీ, వై.ఎస్ వ్యాఖ్యలతో ఆయన విభేదించారు.తెలంగాణ నేతల్లో కొందరు ఎందుకూ పనికిరాని వారున్నారని మధు యాష్కి చెప్పారు.