కష్టాల్లో గవర్నర్: కొడుకునని కేసు

ND Tiwari
న్యూఢిల్లీ: 83 ఏళ్ల రాష్ట్ర గవర్నర్ ఎన్. డి. తివారీ చిక్కుల్లో పడ్డారు. తివారీ తన కన్నతండ్రి అని వాదిస్తూ 29 ఏళ్ల రోహిత్ శంకర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ లో దాఖలైన ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇది నవంబర్ 25వ తేదీన విచారణకు రావచ్చు. రోహిత్ శంకర్ మాజీ మంత్రి ప్రొఫెసర్ షేర్ సింగ్ కూతురు కొడుకు. తనను తివారీ కుమారుడిగా గుర్తించాలని స్వయంగా న్యాయవాది అయిన రోహిత్ శంకర్ కోర్టును కోరాడు. తివారీ కన్నకొడుకునని నిర్ధారించడానికి డిఎన్ఎ పరీక్ష నిర్వహించాలని కూడా అతను అభ్యర్థించాడు.

అయితే రోహిత్ శంకర్ ఆరోపణలను తివారీ ఖండిస్తున్నారు. డిఎన్ఎ పరీక్షకు ఆయన నిరాకరించారు. రోహిత్ శంకర్ తల్లి ఉజ్జ్వల శర్మతో తనకు సాన్నిహిత్య సంబంధం ఉందని మాత్రం ఆయన అంగీకరించారు. రోహిత్ శంకర్ తల్లి ప్రవర్తన మంచిది కాదని ఆయన అన్నారు. రోహిత్ 18 ఏళ్లు నిండిన మూడేళ్ల వ్యవధిలో పిటిషన్ వేయాల్సి ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. తనకు 13 ఏళ్ల వయస్సులో తివారీ తండ్రి అని తెలిసిందని ,18 ఏళ్లు దాటినప్పటి నుంచి తనను కుమారుడిగా అంగీకరించాలని పదే పదే కోరుతున్నానని రోహిత్ శంకర్ అంటున్నాడు.

ఉజ్జ్వల శర్మ బి.పి. శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ఆమె వైవాహిక సంబంధాన్ని కొనసాగిస్తూనే తనతో సంబంధం పెట్టుకుందని, బిపి శర్మతో ఉజ్జ్వల శర్మ సంసారం చేస్తున్న కాలంలో రోహిత్ శంకర్ పుట్టాడని తివారీ వివరించారు. తివారీ వ్యవహారంపై ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో రక్షణ మంత్రిగా పనిచేసిన షేర్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖలు రాశారు. తాను ఢిల్లీలో 3, కృష్ణ మీనన్ మార్గ్ నివాసంలో ఉన్నప్పుడు తివారి తన ఇంటికి తరుచూ వచ్చేవారని, అప్పట్లో (1969) తివారీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని, తమ కూతురు ఉజ్జ్వల యువజన కాంగ్రెస్ మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా పని చేసేదని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+