పిసిసి కార్యవర్గ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యవర్గం జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఖరారు చేసింది. 15 మంది ఉపాధ్యక్షులతో, 20 మంది ప్రధాన కార్యదర్శులతో ఈ జాబితాను పార్టీ విడుదల చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మనుగా చక్రపాణిని నియమించారు. ప్రచార కమిటీ సారథ్యాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి కె. రోశయ్యకు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో రోశయ్య పోటీ చేయరనే విషయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వర్గీయులకు పిసిసి కార్యవర్గంలో సమాన ప్రాతినిధ్యం కల్పించారు.
అన్ని సామాజిక వర్గాలకు పిసిసి కార్యవర్గంలో చోటు కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే, సీనియర్ల, జానియర్ల సమతూకం కూడా పాటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనుకున్నవారికే పిసిసి కార్యవర్గంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఆనంద భాస్కర్ కు, నాదెండ్ల మనోహర్ కు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పట్టుబట్టి కార్యవర్గంలో చోటు ఇప్పించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications