చిరంజీవి పారితోషికం ఎంత?: రఘువీరా
తిరుపతి: అగ్రనటుడిగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారో వెల్లడించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీపరుడనని చెప్పుకుంటున్న చిరంజీవి ఆ విషయం చెప్పడం అవసరమని ఆయన అన్నారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లికి చిరంజీవికి తేడా లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఆస్తులు అమ్ముకుని పార్టీకి ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి తిరుపతి సభకు, ప్రజా అంకిత యాత్రకు ఎంతెంత, ఎవరెవరి నుంచి వసూలు చేశారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. టికెట్లు ఆశిస్తున్న నయా ధనికుల నుంచి ప్రజా రాజ్యం పార్టీ ఎంతెంత సొమ్ము తీసుకుందో కూడా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications