భైంసా అల్లర్లపై బిజెపి ధర్నా
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా అల్లర్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, కార్యకర్తలు సోమవారం రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. అల్లర్లకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ అల్లర్ల విషయంలో ప్రభుత్వం అమాయకులను వేధిస్తోందని ఆయన విమర్శించారు.
మైనారిటీల పట్ల ప్రభుత్వం కరుణ చూపుతూ ఓట్ల రాజకీయానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. దత్తాత్రేయ సహా బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే, సోమవారంనాడు ఉదయం తొమ్మిదిన్నర గంటల మధ్యాహ్నం పన్నెండున్నర గంటల పాటు భైంసాలో కర్ఫ్యూ సడలించారు. ఈ సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు.












Click it and Unblock the Notifications