చిరు తెలంగాణ పర్యటనపై ఆసక్తి

ఉత్తరాంధ్ర పర్యటనకు ముందు చిరంజీవి పోలేపల్లి, సిరిసిల్ల, గంగదేవి పల్లి గ్రామాలను సందర్శించారు. ఈ మూడు కూడా తెలంగాణలోనే ఉన్నాయి. పార్టీలో అధ్యయనం తర్వాతనే తెలంగాణపై తమ వైఖరిని వెల్లడిస్తామని చిరంజీవి తిరుపతి బహిరంగ సభలో చెప్పారు. అయితే, ప్రజలు కోరుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని కూడా ఆయన చెప్పారు. నిజానికి దీపావళి తర్వాత చిరంజీవి మలి విడత ప్రజా అంకిత యాత్ర ప్రారంభమవుతుందని భావించారు. అయితే దీపావళికి ముందు తెలంగాణ జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications