కోస్తా కారిడార్ పై నిర్ణయమే లేదు: మంత్రి
విశాఖపట్నం: కోస్తా కారిడార్ స్థాపనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోక ముందే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఆయన అన్నారు. కోస్తా కారిడార్ విషయంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని, మహా ధర్నా కూడా చేపట్టారని ఆయన అన్నారు.
కోస్తా కారిడార్ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఎకరం భూమిని కూడా సేకరించలేదని ఆయన స్పష్టం చేశారు. అయినా కోస్తా కారిడార్ ను ప్రతిపక్షాలు ప్రజలకు పెను భూతంలా చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు. కోస్తా కారిడార్ పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications