అక్షరధామ్ కేసు: ఒకరి అరెస్టు
అహ్మదాబాద్: అక్షరధామ్ పై దాడి కేసులో పోలీసులు మజీద్ పటేల్ అనే కీలకమైన హవాలా ఆపరేటర్ ను అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బరూచా స్థానిక నేర విభాగం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అనుచరులతో ఉండగా పటేల్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులుచెప్పారు. మిగతా ఇద్దరు పారిపోయినట్లు వారు చెప్పారు. 2003లో అక్షరధామ్ పై ఉగ్రవాదుల దాడి జరిగింది.
ఇండో - గల్ఫ్ హవాలా నెట్ వర్కులో పటేల్ ను అనుసంధాన కర్త గా భావిస్తున్నారు. ఈ నెట్ వర్కు భారత్ లో ఉగ్రవాద కార్యక్రమాలకు డబ్బులు సమకూరుస్తుందని, విచారణలో గుజరాత్ కు సంబంధించిన విషయాలు కూడా వెల్లడి కావచ్చునని పోలీసులంటున్నారు. ఇక్బాల్, మజీద్ పటేల్ ను హవాలా ఆపరేటర్లుగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ లోని బరూచా, మెహసానాల్లో చట్టవ్యతిరేకమైన హవాలా నెట్ వర్కు కేంద్రాలు విరివిగా పనిచేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications