న్యూఢిల్లీ: మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడైన భారతీయ జనతా పార్టీ(బిజెపి) పార్లమెంటు సభ్యుడు బాబూభాయ్ కటారాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. గుజరాత్‌లోని దోహాద్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎన్నికైన కటారా తన పాస్‌పోర్టుపై వేరే వ్యక్తులను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించగా, గత ఏప్రిల్‌లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని విచారించిన లోక్‌సభ కమిటీ కటారాను సస్పెండ్ చేయాలంటూ చేసిన తీర్మానాన్ని ప్రణబ్ ముఖర్జీ మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. కటారా దుష్ప్రవర్తన వల్ల పార్లమెంటు స్థాయి దిగజారినట్లయిందని ముఖర్జీ వ్యాఖ్యానించారు. 14వ లోక్‌సభలో వివిధ కారణాల వల్ల ఇప్పటివరకూ 11 మంది ఎంపీలను బహిష్కరించారు.