ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే అరెస్టు

పశ్చిమ మహారాష్ట్రలో, కొంకణ్ ప్రాంతంలో పర్యటిస్తున్న రాజ్ థాకరేను పోలీసులు రత్నగిరి జిల్లాలో అరెస్టు చేశారు. ఆయనను బాంద్రా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఉత్తర భారతీయులపై దాడిని రాజ్ థాకరే అంతకు ముందు సమర్థించుకున్నారు. తన అరెస్టు వల్ల సంభవించే పరిణామాలను ప్రభుత్వం రుచి చూస్తుందని ఆయన అన్నారు. రాజ్ ను అరెస్టు చేస్తే మహారాష్ట్ర అట్టుడుకుతుందని ఆయన అన్నారు. కాగా, ముంబయి ఎంఎన్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications