టిడిపి మాజీ ఎంపి చారికి 6 నెలల జైలు
ఆదిలాబాద్: హెడ్ కానిస్టేబుల్ పై దాడి కేసులో తెలుగుదేశం నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎస్. వేణుగోపాలాచారికి సెషన్స్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. 500 రూపాయల జరిమానాను కూడా విధించింది. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 1993 మార్చి ఐదో తేదీన వేణుగోపాలాచారి హెడ్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయంలో ఈ గొడవ జరిగింది. ఈ కేసులో మున్సిఫ్ కోర్టు వేణుగోపాలాచారికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
మున్సిఫ్ కోర్టు తీర్పును వేణుగోపాలాచారి జిల్లా సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. సెషన్స్ కోర్టు మున్సిఫ్ కోర్టు తీర్పును బలపరిచింది. కింది కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సెషన్స్ కోర్టు మంగళవారం ఆదేశించింది. కేసు ప్రభుత్వ కుట్ర అని వేణుగోపాలాచారి అన్నారు. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications