హైదరాబాదులో మహిళ దారణ హత్య
హైదరాబాద్: హైదరాబాదులోని సంపన్నులు నివాసం ఉండే జూబిలీ హిల్స్ లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. సురేఖ అనే గృహిణి ఆమె నివాసంలోనే హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురై ఉన్నాయి. భర్త సునీల్ కుమారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సునీల్ కుమార్ కు వైవాహికేతర సంబంధం ఉందని, ఈ విషయమై సురేఖ భర్తతో గొడవ పడిందని, దీంతో సునీల్ కుమార్ భార్యను హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించామని, క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగిందని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications