నా మిత్రుల్లో అందరూ ఉన్నారు: వైయస్

తాము మైనారిటీలను బుజ్జగించడం లేదని, వారికి రక్షణ కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఆయన తెలిపారు. తాను అవినీతి ఆరోపణలను విని పారిపోలేదని, విచారణలు జరిపించానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కోస్తా కారిడార్ అనే ప్రతిపాదనే లేదని ఆయన స్పష్టం చేశారు. వేయి కోట్ల కుంభకోణం జరిగిందని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications