కళ్యాణ్రామ్పై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం

విజయవాడ : నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్‌ వైఖరిపై శనివారం కృష్ణా జిల్లా టిడిపి కార్యర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీనితో స్థానిక నేతలు రంగంలోకి దిగి వారిని సముదాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్‌ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీకి తిరిగి వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో రంగంలోకి దిగిన నందమూరి వారసులకు రాజకీయ వాక్చాతుర్యం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తున్నది.

కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న కళ్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ లక్ష్యమని వెళ్ళిన ప్రతీచోటా చెప్పారు. అయితే చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడకపోవడంపై కార్యకర్తలు ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలిసిన కళ్యాణ్‌రామ్‌ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నదే తమ లక్ష్యమనీ, తారకరత్న వ్యాఖ్యలను వక్రీకరించారని వివరించడంతో కార్యకర్తలు శాంతించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+