రాజమండ్రి: అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే సమయం వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మహాధర్నాలో పాల్గొనేందుకు వెళుతూ ఆయన కొవ్వూరు, నిడదవోలులో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్తులను మంత్రి జక్కంపూడి సొంత ఆస్తులుగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. చారిత్రాత్మకమైన రాజమండ్రి-కొవ్వూరు బ్రిడ్జిని కూడా అక్రమార్జనకు వాడుకుంటున్నారని అన్నారు.