విశాఖపట్నం: కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం రాత్రికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలోను తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయి. వాయుగుండం ప్రబావంతో తూర్పు కోస్తా తీరంలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.