పార్లమెంటు సమావేశాలు వాయిదా

శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని లెఫ్ట్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి పార్లమెంటు సమావేశాలను ఆషామాషీగా పరిగణిస్తోందని దుయ్యబట్టింది. డిసెంబర్ 8 తరువాత పార్లమెంటును నిర్వహించాలన్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. అప్పటికి ఢిల్లీ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే ప్రస్తుత సమావేశాలను పొడిగిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వాయలార్ రవి ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలు, దీపావళి పండుగ ఉన్నందున పార్లమెంటును వాయిదా వేయాలని వివిధ పార్టీలు డిమాండ్ చేశాయని, ఆ మేరకు డిసెంబర్ 10న సమావేశాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.












Click it and Unblock the Notifications
