సిఎం బాబు, తర్వాత బాబాయి: తారకరత్న

కాబోయే సీఎం బాలకృష్ణ అని తాను అనలేదని, అదంతా మీడియా సృష్టేనని అన్నారు. భవిష్యత్తులో బాలయ్య సీఎం అవుతారని అన్నానని, అది ఖాయమని తారకరత్న స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని, గర్జన ఏర్పాట్లను పరిశీలించాలని బాబాయి ఆదేశించడంతో వచ్చానన్నారు. అంతకుముందు గుంటూరులో నందమూరి అభిమానుల ర్యాలీకి అనూహ్యస్పందన లభించింది. 4 గంటలపాటు సాగిన ర్యాలీకి అభిమానులు నీరాజనాలు పలికారు.
తెలుగు యువత నేతతో అభిమానుల ఘర్షణ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీనివాస్‌తో నందమూరి అభిమానులు ఘర్షణ పడ్డారు. తారకరత్న ఎదుటే శ్రీనివాస్‌పై అభిమానులు చేయి చేసుకున్నారు. ఆయన కూడా వారిని కొట్టారు. దీంతో ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు అభిమాన సంఘాల నాయకులు జోక్యం చేసుకుని తారకరత్న వాహనంపై శ్రీనివాస్‌ను కూర్చోనివ్వడంతో వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications
