రామోజీపై యుద్ధం ఢిల్లీకి: ఉండవల్లి

మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ వేర్వేరు సంస్ధలు కావని, అక్కడి నిధులను ఇక్కడికి ఇక్కడి నిధులను అక్కడికి తరలిస్తుంటారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీరావు తనకు లీగల్ నోటీసు ఇవ్వడం సంతోషకరమని, ఈ కేసు ద్వారా ఎన్నో సంగతులను బయటపెట్టే అవకాశం తనకు వచ్చిందని ఆయన చెప్పారు. రామోజీ గ్రూపు సంస్ధల లావాదేవీలపై సమాచార హక్కు చట్టం కింద తాను సమాచారం కోరానని, ఇన్ కంటాక్స్ డిప్యూటీ కమిషనర్ కూడా సమాచారం అందిస్తారని ఉండవల్లి అన్నారు. రామోజీరావు చేస్తున్న అక్రమ వ్యాపారాలతో బిజెపికి సంబంధాలు ఉన్నాయని, అందుకే తన పుస్తకాన్ని అద్వానీ రామోజీరావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకున్నారని అరుణ్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications
