హైదరాబాద్: పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు ప్రకృతి వనరులను పెంచుకోవలసి ఉందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. రెండు రోజులపాటు జరిగే దక్షిణాదిరాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశాన్ని ఆయన ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో అటవీశాఖ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. వివిధ రాష్ట్రాలు అటవీ సంరక్షణలో చేపడుతున్న కార్యక్రమాలను, అనుభవాలను ఒకరికొకరు పంచుకోవాలని సూచించారు. పర్యావరణం, అడవుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం కీలకమైనదని ఆయన అన్నారు.