హైదరాబాదులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అమీర్ పేట ప్రాంతంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లాల్ బంగ్లాలోని నికాల్ సెంటర్లో జరిగింది. ఏడు దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. పెద్ద యెత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
భవనంలో మొదటి అంతస్థులో మంటలు లేచాయి. దీంతో ఫర్నీచర్, ఇతర సామగ్రి దగ్ధమైంది. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంతో పంజగుట్ట, అమీర్ పేట ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ భవనంలో దాదాపు 30 సంస్థలు ఉన్నాయి. రెండు ఫైరింజన్లు మాత్రమే వచ్చాయి. అవి కూడా సరిగా పని చేయడం లేదు.












Click it and Unblock the Notifications