గుంటూరు చేరుకున్న బాలయ్య

గుంటూరులో యువగర్జన సదస్సు జరగనున్న ఎన్టీఆర్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. సదస్సుకోసం సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఎద్దుకొమ్ములను ఇరువైపులా అలంకరించి గర్జించే సింహాలను ఉంచటంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వేదికకు చుట్టుపక్కల ఏర్పాటుచేసిన నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, కల్యాణ్‌రామ్, తారకరత్న కటౌట్లు,పూల ప్రభలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.సదస్సు ఏర్పాట్లను నందమూరి తారకరత్న పర్యవేక్షించారు. యువగర్జన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications