నాకు అంత శక్తి లేదు: నారాయణ

పొత్తుల విషయంలో మాకు దురుద్దేశాలు లేవని, రాజకీయాల్లో రహస్యాలు ఉండవని, విధానాల ప్రాతిపదికనే మా నిర్ణయాలుంటాయని నారాయణ చెప్పారు. వామపక్షాలు పొత్తులపై ఇంకా అధికారిక ప్రకటనలు చేయలేదని, అప్పుడే తాము వేర్వేరుగా పోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యంతో కలిసి వచ్చేలా సిపిఎంను ఒప్పిస్తారా అని అడిగితే ఏ రాజకీయ పార్టీనీ మరొక పార్టీ ఒప్పించడం సాధ్యం కాదని, ఎవరి విధానాలు వారివని, అందుకనుగుణంగా రెండు పార్టీల నేతలం చర్చించుకుని ఒక అవగాహనకు వస్తామని సమాధానమిచ్చారు.
ఒకవేళ సీపీఐ ప్రతిపాదనలను సీపీఎం అంగీకరించనప్పుడు చేం చేస్తారని ప్రశ్నించగా భవిష్యత్తును ఊహించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని బదులిచ్చారు. వామపక్షాలతో కలిసే ఉంటామని చెప్పిన తెరాస ఎటు వెళ్తుందనేది ఆ పార్టీ నేతలే చెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంకా పూర్తిగా పరిపక్వదశకు చేరుకోలేదని, మారుతున్న రాజకీయ పరిస్థితులను ఇంకా సమీక్షించాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications