నర్సంపేటలో చిరంజీవిపైకి కోడిగుడ్లు

వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపైకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు మంగళవారంనాడు కోడిగుడ్లు విసిరారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ పనికి ఒడిగట్టారు. తాను ఇప్పటికే తెలంగాణపై చాలా స్పష్టత ఇచ్చానని, ఇటువంటి చర్యలకు పాల్పడడం సరైన పని కాదని చిరంజీవి అన్నారు. తమ పార్టీ కార్యకర్తల అండదండలతో ఎన్ని కష్టాలనైనా, అవమానాలనైనా భరిస్తానని ఆయన అన్నారు. చిరంజీవి పైకి కోడిగుడ్లు విసిరిన ఇద్దరు తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి చేష్టలకు తాను భయపడేది లేదని చిరంజీవి అన్నారు. పూలదండలు వేసినవారికి వందనాలు, కోడిగుడ్లు విసిరినవారికీ వందనాలు అని ఆయన అన్నారు. కోడిగుడ్లు విసిరడాన్ని తాను వారి సంస్కారానికి వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. చిరంజీవి వెనక్కి తగ్గడని ఆయన అన్నారు. సెజ్ ల కోసం ప్రభుత్వం తాటిచెట్లను నరికేయిస్తోందని, దీనివల్ల గీత కార్మికుల ఉపాధిని దెబ్బ తీస్తోందని ఆయన అంతకు ముందు అన్నారు.

సంయమనం పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలకు పిలువునిచ్చారు. చిరంజీవిపైకి తమ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లు వేశారనే వార్త తెలిసిన ఆయన ఈ పిలువునిచ్చారు. ఇలాంటి చర్యలు తమ విధానం కాదని ఆయన అన్నారు. తెరాస కార్యకర్తలు తనపై కోడిగుడ్లు విసరడం పట్ల చిరంజీవి మనస్తాపం చెందినట్లు సమాచారం. కోడుగుడ్లు విసరడమేమిటని ఆయన తన ఆంతరంగికులతో అన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+