తిరుపతి హత్య కేసులో అరెస్టు
తిరుపతి: తొమ్మిదేళ్ల బాలిక అయేషా హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు అబిద్ ను అరెస్టు చేశారు. అయేషా గురువారంనాడు తిరుపతిలో హత్యకు గురైంది. హత్యానేరాన్ని అబిద్ పోలీసుల ముందు అంగీకరించాడు. హబీబ్ అయేషాకు మేనమామ. హత్యలో తనకు మరో ఇద్దరు సహకరించినట్లు అబిద్ చెప్పాడు. దీంతో ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శివ అనే నిందితుడు పట్టుబట్టాడు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయేషాను కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేసి ట్రాన్స్ పోర్టు కార్యాలయం వద్ద ఆగి ఉన్న లారీలో మృతదేహాన్ని పడవేశారు. ఓ కార్పోరేట్ పాఠశాలలో చదువుతున్న అయేషాను సాయంత్రం పాఠశాలకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్ చేసి హత్య చేశారు. మోటార్ సైకిల్ పై వచ్చి అబిద్ అయేషాను తీసికెళ్లి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.












Click it and Unblock the Notifications