బాబుతో అజిత్: నారాయణతో దేవేందర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో రాష్ట్రీయ లోకదళ్ నేత అజిత్ సింగ్ శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వీరిరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అజిత్ సింగ్ గురువారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమికి మద్దతుగా అజిత్ సింగ్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) నేత టి. దేవేందర్ గౌడ్ సమావేశమయ్యారు. తాము తెలంగాణ భవిష్యత్తు ఉద్యమం గురించి మాట్లాడుకున్నామని దేవేందర్ గౌడ్ చెప్పారు. సిపిఐ, ఎన్టీపిలు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చునని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇరువురు నాయకుల భేటీకి ప్రాధాన్యం చేకూరింది.












Click it and Unblock the Notifications