మొదటికొచ్చిన శైలజారెడ్డి తొలగింపు
హైదరాబాద్: నెల్లూరు మేయర్ శైలజా రెడ్డి తొలగింపు వ్యవహారం మళ్లీ మొదటి వచ్చింది. శైలజారెడ్డిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ సరిగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తొలగింపునకు కారణాలు తెలియజేస్తూ శైలజారెడ్డికి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మేయర్ తొలగింపు ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు తెలియజేసింది. శైలజారెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసు సరిగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా కారణాలు చూపుతూ షోకాజ్ నోటీసు ఇవ్వాలని కూడా సూచించింది.












Click it and Unblock the Notifications